న్యూఢిల్లీ: తన కెరీర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను చూసినా టెక్నికల్‌గా అత్యంత పటిష్టమైన ఆటగాడు మాత్రం ఒక్కడే ఉన్నాడని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తెలిపాడు. తన హయాంలో బ్రియాన్ లారా, కుమార సంగక్కరా, రాహుల్ ద్రవిడ్, జాక్వస్ కల్లిస్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు కాగా, ఇక్కడ భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రం చాలా స్సెషల్ అని క్లార్ పేర్కొన్నాడు. ద్రవిడ్, సంగక్కరా, బ్రియాన్ లారాలు తమ ఆట తీరుతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరినప్పటికీ, సచిన్ మాత్రం చాలా కఠినమైన బ్యాట్స్‌మన్ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. సాంకేతికంగా తాను చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్ మాత్రం సచిన్ ఒక్కడేనన్నాడు.(‘అలాంటి అవసరం మాకు లేదు’ )
‘టెక్నికల్‌గా ఆ భారత్ లెజెండ్ చాలా స్ట్రాంగ్’