ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ?

అసలే కరోనాతో ఓ వైపు ప్రపంచం గజగజవణికిపోతుంటే ఏప్రిల్‌ 19న ప్రపంచం కనుమరుగవుతోందని పిడుగు లాంటి మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతరిక్షం నుంచి వస్తున్న ఓ పెద్ద గ్రహశకలం భూమి నుంచి దూసుకెళ్తుందని, అప్పుడు యుగాంతం తప్పదని అంటున్నారు. అయితే దీంట్లో వాస్తవమెంత..? ఇప్పుడే ఈ ప్రచారం ఎందుకు తెరపైకి వచ్చిందని అంతా చర్చించుకుంటున్నారు. 2020 సంవత్సరంలో ఓ భారీ గ్రహ శకలం భూమికి సమీపంగా వెళ్తుందని మూడేళ్ల క్రితం నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే.